03-03-2025 08:30:46 PM
భయభ్రాంతులకు గురవుతున్న యజమాని..
కొల్చారం (విజయక్రాంతి): కొల్చారం మండల పరిధిలోని నాయినీజలాల్ పూర్ గ్రామంలో ఓ కోళ్ల ఫారంలో 2000 కోళ్లు మృతి చెందాయి. కోళ్ల ఫారం యజమాని సతీష్ గౌడ్ ఆవేదన చెందుతున్నాడు. గంటల వ్యవధిలోని 2000 కోళ్లు మృతి చెందడంతో సుమారుగా రెండు లక్షల రూపాయల వరకు నష్టపోయామని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సహాయం అందించి తగిన చర్యలు చేపట్టాలని పౌల్ట్రీఫామ్ యజమాని సతీష్ గౌడ్ కోరారు.
పశుసంవర్ధక శాఖ అధికారులు, కోడి పిల్లలను పంపిణీ చేసిన సూపర్వైజర్లు ఎవరు కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బర్డ్ ప్లు వచ్చిందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. మృతి చెందిన కోళ్లను ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్లి అడవిలో గొయ్యి తీసి పాతి పెట్టడం జరిగిందని సతీష్ గౌడ్ తెలిపారు. ఈ విషయం కోసం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్యను వివరణ కోరగా జిల్లాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లు సంబంధించినటువంటి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.