12-02-2025 12:16:11 AM
బోర్లంలో 8 వేలకు పైగా కోళ్ల మృత్యువాత
బాన్సువాడ, ఫిబ్రవరి 11 ( విజయ క్రాం తి): అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బొర్లం క్యాంపులో మంగళవారం వెలుగు చూసింది. స్థానికులు బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల కోళ్లకు అంతుచిక్కని వ్యాధి ప్రబలుతుండడంతో పౌల్ట్రీ ఫార్మ్ నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతు న్నారు.
లక్షల్లో పెట్టుబడి పెట్టి కోళ్ల పెంప కాన్ని చేపడితే అంతుచిక్కని వ్యాధి మహ మ్మారి రోజుకో గ్రామంలో పౌల్ట్రీ ఫార్ములా లో పెరుగుతున్న కోళ్లు అంతు చిక్కని వ్యాధితో మృతి మృత్యువాత పడుతు న్నాయి. పౌల్ట్రీ రైతులను తీవ్ర నష్టాల్లోకి నెట్టుతున్నాయి. లక్షల్లో అప్పులు చేసి పౌల్ట్రీ లలో కోళ్లను పెంపకం చేపడితే అందు చిక్క ని వ్యాధి ప్రబలడంతో కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
గత వారం రోజుల్లోనే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో 20వేళ్లకు పైగా పొల్లు మృత్యువాత పడ్డాయి. మంగళవారం బాన్సువాడ మండల పరిధిలోని బొర్లం గ్రామంలో 8100 కోళ్లు మృత్యువాత పడ్డాయి. బాన్సువాడ డివిజన్ బోర్లం క్యాంప్ గ్రామంలోని కోళ్ల ఫారంలో కళ్ల ఎదుటే కోళ్లు కొట్టుకుంటూ చనిపోతుండ టంతో, యజమాని బోడ రామచందర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
వైరస్ సోకడం తోనే సెకనుకు ఒక్కొక్కటి చొప్పున కోళ్లు మృతిచెంతున్నాయని యజమాని వాపో యాడు. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదు కోవాలని కోరారు. అంతుచిక్కని వ్యాధి వైరస్ రోజురోజుకు ప్రభుత్వం పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్ల పెంపకం దారుల వద్దకు వచ్చి అంతుచిక్కని వ్యాధి వల్ల మృత్యువాత పడకుండా కోళ్లను రక్షించాలని పౌల్ట్రీ రైతులు కోరుతున్నారు.
ఇప్పటికే వ్యాధి సోకి మృతి చెందుతున్న పౌల్ట్రీ ఫామ్ లా వద్దకు పశు సంవర్ధక శాఖ అధికారులు వచ్చి మందులను ఇవ్వడమే కాకుండా ముందు జాగ్రత్తలు చర్యలను చేపట్టే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందకుండా భరోసా కల్పిస్తున్నారు.