21-02-2025 02:15:26 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ముక్క లేనిదే ముద్ద దిగని చికెన్(Chicken) ప్రియులకు జిల్లాలో ఇంకొన్ని రోజులు చికెన్ కోసం వేచిచూడాల్సిందే. కోళ్లలో వస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి(Bird Flu Disease) కారణంతో ఆదిలాబాద్ జిల్లాలోని చికెన్ వ్యాపారంపై పెను ప్రభావం చూపుతోంది. నేటి నుండి మార్చ్ 1వ తేదీ వరకు జిల్లాలో చికెన్ అమ్మకాలను నిలిపివేస్తూ వ్యాపారస్తులు నిర్ణయించారు. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న కోళ్ల వాహనాలను తిప్పి వెనక్కి పంపడంతో జిల్లాకు కోళ్ల సరఫరా నిలిచిపొయింది. అదేవిధంగా బర్డ్ ఫ్లూ(Bird Flu)తో చాలా మంది చికెన్ తినడం మనేయడంతో వ్యాపారాలు లేక కొన్ని రోజులు చికెన్ అమ్మకాలను నిలిపివేస్తూ తీర్మానించారు. దింతో అన్ని చోట్లా చికెన్ దుకాణాలు మూసివేశారు.