calender_icon.png 23 February, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో చికెన్ గున్యా, వైరల్ జ్వరాలు

22-02-2025 10:44:38 PM

ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో వైద్య శిబిరం ఏర్పాటు

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఎల్లారంలో సోకిన విష జ్వరాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో చికెన్ గున్యా విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయం స్థానిక జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు దృష్టికి స్థానికులు తెలియజేయడంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం ఎల్లారం గ్రామంలో చికెన్ గున్యా, వైరల్ ఫీవర్ లతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయాన్ని శనివారం గ్రామస్తు లు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి రాగానే తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపాధికన హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. ఎల్లారం గ్రామంలో చాలా మంది వైరల్ ఫీవర్, చికెన్ గున్యాతో గత కొద్ది రోజులుగా బాధ పడుతున్నారని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి దృష్టికి రాగానే వెంటనే జిల్లా వైద్య అధికారులతో మాట్లాడి తక్షణమే హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు వెంటనే స్పందించిన వైద్య అధికారులు ఎల్లారం గ్రామంలో వైద్య ఆరోగ్య శిబిరాన్ని  ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనారోగ్యం బారిన పడిన వారికి సరైన వైద్యం మందులు అందిస్తున్నారు. గ్రామస్తులు పూర్తిగా ఆరోగ్యంగా కోలుకునే వరకు  హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ గ్రామస్తులకి వైద్యులు అందుబాటులో ఉండి సేవలందించాలని ఎమ్మెల్యే  వైద్య అధికారులను ఆదేశించారు. గ్రామస్తులంతా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు.