calender_icon.png 25 February, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగదేవపూర్ లో చికెన్ మేళ

25-02-2025 08:08:28 PM

70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికినందున ఎలాంటి సమస్య ఉండదు...

జగదేవపూర్: తెలంగాణలో బర్డ్ ఫ్లూ కోళ్లకు సోకలేదని, ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలు చికెన్ ని కోడిగుడ్లను వినియోగించవచ్చని జగదేవపూర్ మండలం నాయకులు అన్నారు. మంగళవారం జగదేవపూర్ మండల కేంద్రంలో వెంకాబ్ చికెన్ ఆధ్వర్యంలో చికెన్ మేలా నిర్వహించి ప్రజలకు వండిన చికెన్, ఉడికిన కోడిగుడ్లను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రజలకు చికెన్ గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణలో బర్డ్ ఫ్లూ వ్యాపించలేదన్నారు. 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకడం వల్ల చికెన్ గాని గుడ్లు గాని తింటే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

ప్రజలకు చౌకగా దొరికే చక్కని పోషక విలువలున్న మాంసాహారం చికెన్ మాత్రమే అన్నారు. కాబట్టి ప్రజలంతా ఎలాంటి అపోహలు లేకుండా చికెన్ కోడిగుడ్ల వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో వెంకటేశ్వరా హ్యాచరీస్ కనకా రెడ్డి, మార్కెటింగ్ సీనియర్ మేనేజర్ సెంథిల్ కుమార్, నాయకులు బుద్ధ నాగరాజు, పనుగట్ల శ్రీనివాస్, కొత్త శ్రీనివాస్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి ఇక్బాల్, కుమ్మరి కనకయ్య, నాయకులు, స్థానిక వ్యాపారస్తులు మల్లేశం, మొహమ్మద్ అజీజ్, బిక్షపతి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.