19-03-2025 01:58:25 AM
వైరస్ సోకిన కోళ్లుగా అనుమానం
పాపన్నపేట, మార్చి 18: మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలో ప్రవహిస్తున్న మంజీరా నదిలో కోళ్ల కళేబరాలను పడేయడం కలకలం రేపింది. పేరూర్ ఎల్లాపూర్ బ్రిడ్డికి సమీపంలో కళేబరాలను పారబోశారు. వైరస్ సోకి చనిపోయిన కోళ్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో అవి కుళ్లిపోయి మంజీరా నీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. నీటిని పశువులు తాగడం మూలంగా అవి రోగాల భారీన పడే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు. కళేబరాలను పడేసిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే మెదక్ పట్టణానికి మంచినీటిని అందించే వాటర్ ప్లాంట్ ఉంది. దీంతో పట్టణవాసులు ఈ నీటిని తాగి అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నిందితులపై సంబంధిత అధికారులు శిక్షించాలని, మంజీరాలో పారబోసిన కోళ్ల కళేబరాలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.