calender_icon.png 22 February, 2025 | 12:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోళ్లకు కొక్కెర తెగులు..!

18-02-2025 12:00:00 AM

ప్రజారోగ్యంపై ప్రభావం 

ఇదివరకే ప్రజల్లో బర్డ్‌ఫ్లూ భయం

జిల్లా స్థాయిలో కోళ్ల ఫారాల లెక్క తెలియని అధికారులు 

అధికారుల పర్యవేక్షణ కరువు

చచ్చిన కోళ్లను గుట్టుచప్పుడు కాకుండా సమాధి

మాఫియాగా మారిన చికెన్ వ్యాపారం 

ఖానాపూర్, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ర్టంలో, బర్డ్ ఫ్లూ వదంతి తీవ్ర కలకలం రేపగా, అది వట్టి పుకారే అని అధికారులు కొట్టివేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఏడు ఫిబ్రవరి, మార్చి, నెలల్లో కోళ్లకు కొక్కెర వ్యాధి తెగులు సోకి అనేక కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోయే ప్రమాదం ఉంటుం దని, పశు వైద్యాధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుత కాలంలో, చికెన్ వినియోగం విరివిగా ఉండడం వల్ల ,చికెన్ తినాలా? వద్దా?అనే మీమాంసలో ప్రజలు వున్నారంటే అతిశయోక్తి కాదు. స్థానికంగా ఈవిషయం ప్రజలకు విడమ రిచి చెప్పే నాధులు కరువయ్యారని పలువురు వాపోతు న్నారు.

చికెన్ షాపులపైన, వాటి అమ్మకాలపై, తగు పర్యవేక్షణ చేయాల్సిన మున్సిపాలిటీ అధికారులు ,ఆ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు లేకపోవడంతో ,అందిన కాడికి దోచుకుంటున్న వైనం జోరుగా సాగుతోంది. చికెన్ వ్యాపారం ప్రస్తుత కాలంలో ఒక మాఫియాల మారిందంటే ఆశ్చర్యం లేదు. నిజానికి కొక్కెర వ్యాధి సోకిన కోడి మాం సం తిన్నా , అది కూడా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పశు వైద్యులు తెలపడం గమనారం. కాగా కోడి మాంసం అనుదిన ఆహారంలో భాగం కావడంతో, వినియోగదారులు అడ్డుఅదుపు లేకుండా, మాంసం విని యోగిస్తున్నారు.

అయితే నిర్మల్ జిల్లాలో 60 వరకు బ్రాయి లర్ కోళ్ల ఫామ్ లు ఉండగా, ఇది కేవలం అధికారుల దృష్టికి వచ్చిన లెక్కే అయినప్పటికీ, అనధికారికంగా ఇంతకన్నా అధికంగానే ఉంటాయన్నది, అనేకుల వాదన. అయితే కోళ్ల వ్యాపారంలోపై స్థాయి వ్యాపా రస్తుల వద్ద, కొంతమేర వైద్య పరీక్షలు నిర్వహించి, వాటిపై పర్యవేక్షణ ఉన్న మాట వాస్తవం అయినప్పటికీ, జిల్లా, మండల, గ్రామాల, స్థాయిలో బ్రాండె డ్ చికెన్ పేర్లు చెప్పుకొని, స్థానికంగా గ్రామాల్లో, లోకల్ గా కోళ్లను పెంచి అడ్డగోలు రేట్లకు అమ్మి, అడ్డంగా సొమ్ము చేసుకుంటున్నారని పలు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలో, ఉన్న పలు హోల్సేల్ చికెన్ షాపు వారికి , వారి సొంత ఫాంములు ఏర్పాటు చేసుకొని, బ్రాండెడ్ పేరుతో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. వీటిపై, నిజానికి మున్సిపాలిటీ నుంచి సానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, పర్యవేక్షణ చేసి, షాపు యజమానులను అదుపులో ఉంచా ల్సింది పోయి, అటువంటి చర్యలు ఏమీ లేకపోవడంతో, వారి ఇష్టారాజ్యం అయిపోగా పలు అనుమానాలక తావి స్తోంది.

ప్రతి ఫంక్షన్‌కి, పెళ్లిళ్లకి, ఇతర విందు, వినోదాలకు, చికెన్ తప్పనిసరి కావడంవల్ల ఖానాపూర్, కడం, దస్తురాబాద్, పెంబి, ఈ ప్రాంతాల్లో కోళ్ల సరఫరా ఎక్కడి నుంచి వస్తుందో..? ఎవరికీ తెలియకుండా పోయింది. దీంతో వినియోగదారులు చేసేది లేక, అందుబాటులో ఉన్న కోడి మాంసాన్నే వండుకొని తిని, అనారోగ్యం పాలవు తున్నారని, ఆరోపణలు ఉన్నాయి. నిజానికి జిల్లా స్థాయిలో, ఎటువంటి పర్యవేక్షణ లేదన్నది సత్యమైనప్పటికీ ,ప్రస్తుత పరిస్థితుల్లో కొక్కెర వ్యాధి ప్రజలను కలవరపెడుతుందన్నది వాస్తవం.

దీంతో కూడా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని, పశు వైద్యాధికారులు, కోళ్ల ఫారం యజమానులను చైతన్య పరిచినప్పటికీ, ఎంత మేర కోళ్లు చచ్చిపోతున్నాయి అన్నది అధికారుల దృష్టికి రాకుండా, సమాధి చేస్తున్నారని ,కొన్నిచోట్ల వ్యాధి సోకిన కోళ్లను, అవి చచ్చేముందే కోసి, అమ్ముతున్నట్లు ఆరోపణలు కూడ లేకపోలేదు. ప్రజారోగ్యం పాడుకాకముందే స్థానిక సానిటరీ, పశువైద్యాధికారుల, పర్యవేక్ష ణలో ఈ వ్యాపారం సాగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి

ప్రస్తుతం చలికాలం నుంచి, ఎండాకాలంలోకి మారుతున్న నేప థ్యంలో, కోళ్లపై తీవ్ర ప్రభావం చూ పి, కొక్కెర వ్యాధి ప్రభలే అవకాశం ఉంటుంది. ఇదివరకే ఫాంలలో కోళ్లు చనిపోతున్న సమాచారం తమకు ఉందని, ఈ వ్యాధి ప్రబలకుండా చూడాలి, తెగులు సోకితే వెంట నే, న్యూ డక్ పౌడర్, టెట్రాసైక్లిన్, మందులు మా వద్ద సరఫరా ఉన్నాయని, లేనట్లయితే ప్రైవేట్లో లసోట అనే మందులు తీసుకుని, కోళ్ల కళ్ళు, ముక్కులో, వేయాలి. ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయంతో మహారాష్ర్ట, ఆంధ్రప్రదేశ్, నుంచి కోళ్ల సరఫరా నిలిచిపోయిందని అన్నారు. కాగా ఈ ప్రాంతంలో సుమారు 20 వేల కోళ్ల వరకు సాగు చేస్తున్నట్లు సమాచారం ఉన్నది. మా శాఖ తరఫున నిరంతర పర్యవేక్షణ ఉంటుంది.

 రామచంద్రుడు, ఖానాపూర్ ,పశువైద్య సహాయ సంచాలకుడు