02-03-2025 12:16:32 AM
పింక్‌బుక్ అంటే బీఆర్‌ఎస్సోళ్ల బుక్కు అనుకోకండి.. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో పార్టీల కలర్‌లతో బుక్కులు రాయడం ట్రెండ్ అయిపోయింది. పక్క రాష్ట్రంలో గతం లో లోకేశ్‌బాబు ఓ బుక్కు, ఇప్పుడు వైసీపోళ్లు ఇంకో బుక్కు రాస్తున్నారు. మన దగ్గర కూడా కొందరు బుక్కులు రాస్తామంటున్నారు.
అయితే మనం చదవబోయే పింక్‌బుక్ పొలిటికల్ బుక్కు కాదులెండి!. రైల్వేవాళ్లు ఏ జోన్‌కు ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పే బడ్జెట్ బుక్కే ఈ పింక్ బుక్కు. ఈ బుక్కు బయటకొస్తేనే ఏ జోన్‌కు ఎన్ని పైసలు ఇచ్చారో, ఏ స్టేషన్‌ను ముస్తాబు చేస్తారో..కొత్త లైన్ల సంగతేంటో తెలుస్తుంది.
మొన్నటి సెంట్రల్ బడ్జెట్‌లో తెలంగాణ రైల్వేలకు రూ.5,337 కోట్లను కేటాయించారు. అయితే ఈసారి మాత్రం ఇంకా పింక్‌బుక్‌ను విడుదల చేయలేదు. దీంతో రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులు తెలియక ప్రయాణికులతో పాటు అధికారులు పరేషాన్ అవుతున్నారు. పింక్‌బుక్‌ను బ్లాక్ చేశారా ఏంటి అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.
పెద్ది విజయభాస్కర్