calender_icon.png 21 February, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ఘనంగా ఛత్రపతి శివాజీ శోభాయాత్ర

19-02-2025 07:10:46 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో బుధవారం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా శోభాయాత్రను హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఘనంగా నిర్వహించారు. కన్నాల శివాంజనేయ దేవాలయం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర పాత బస్టాండ్, రామ టాకీస్ ల మీదుగా కూరగాయల మార్కెట్ వద్ద గల అంబేద్కర్ చౌరస్తా వరకు జోరు నినాదాలతో కొనసాగింది. మరాఠా సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన పరాక్రమవంతుడు శివాజీ అని కొనియాడారు. దేశంలో హిందూ ధర్మాన్ని పరిరక్షించిన మహనీయుడన్నారు.