06-03-2025 12:00:00 AM
కుత్బుల్లాపూర్, మార్చ్ 5(విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ చౌరస్తాలో మంగళవారం సాయంత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్నికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు డి.అరవింద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మం పై జరుగుతున్న దాడులు దుష్ట శక్తులను ఎదుర్కోవడానికి హిందూ సమాజo సంఘటితం కావాలని అన్నారు.భవిష్యత్తు లో దేశాన్ని ధర్మాన్ని కాపాడే పార్టీలకే ఓట్లు వేయాలని హిందూ ధర్మం కోసం శివాజీ పోరాటం ఒక్కొక్క విదేశీ మొగలాయి ముష్కరులను తరిమికొట్టి జయించిన కోటలను ప్రతిబాపటిమ శంభాజీ ప్రాణ త్యాగం ఊరికే పోకూడదు అంటే కులాలు పక్కన పెట్టి హిందూ ఓటర్లు చైతన్యo కావాలని అన్నారు.
శివాజీ అనే వ్యక్తి లేకుంటే ఈరోజు దేశం ఇంత ప్రశాంతంగా ఉండేది కాదని హిందూ చైతన్యమే పరమావదిగా పనిచేయాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో వి హెచ్ పి ముడుపు యాదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డా ఎస్. మల్లారెడ్డి,సభాధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవర్గులు క్యాసారం మల్లేష్,దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా జిఎస్ లు విగ్నేష్, గిరివర్ధన్ రెడ్డి,ఏ. మల్లేష్ యాదవ్,
డి.శ్యామ్ రావు, కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, భరతసింహరెడ్డి,విజయలక్ష్మి మాజీ సర్పంచ్ కొమ్ము మంగమ్మ, మాజీ ఎంపీటీసీ జంగారెడ్డి, గోనె మల్లారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింహా చారీ, ఏ.శ్రీనివాస్ యాదవ్, మురళి, ఆకుల విజయ్, వెంకటేష్ నాయక్, భానుగౌడ్, శివ, యశ్వంత్ పాల్గొన్నారు.