calender_icon.png 21 February, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ జయంతి వేడుకలు

19-02-2025 12:37:55 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని లక్ష్మి టాకీస్ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు(Chhatrapati Shivaji Maharaj Jayanti Celebrations) బుధవారం ఘనంగా నిర్వహించారు. బిజెపి జిల్లా నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొని ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) విగ్రహ స్థాపన కోసం ఐదు సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్, సంబధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా అధికారులు అనుమతి ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి శివాజీ విగ్రహ స్థాపనకు అనుమతి ఇచ్చి లక్ష్మీ టాకీస్ చౌరస్తాకు శివాజీ చౌక్ గా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ణకంటి రవీందర్, బోయిని హరి కృష్ణ, కిరణ్, మున్నారాజా సిసోడియా, పెద్దపల్లి పురుషోత్తం, ఆకుల అశోక్ వర్ధన్, మోటూరి కిరణ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, చిరంజీవి, బెల్లంకొండ మురళి, తదితరులు పాల్గొన్నారు.