calender_icon.png 27 February, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేడుకగా ఛత్రపతి శివాజీ జయంతి శోభాయాత్ర

20-02-2025 12:59:05 AM

యాదాద్రి భువనగిరి; ఫిబ్రవరి 19 ( విజయ క్రాంతి ): చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రధా నమైన మండల కేంద్రాలలో బిజెపి అను బంధ సంఘాలు శోభాయాత్రలను నిర్వ హించారు. అంతేకాకుండా మోత్కూరు, గుండాల, ఆత్మకూరు, రామన్నపేట, యాదగిరిగుట్ట, భువనగిరి, వలిగొండ మండల కేంద్రాలలో బిజెపి, విశ్వహిందూ పరిషత్ ఇతర అనుబంధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో శివాజీ జయంతి శోభా యాత్రలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.

కాషాయ జెండా లతో ప్రధాన సెంటర్ల నుండి వందలాది మంది హిందూ వాహిని కార్యకర్తలు నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహించి మండల కేంద్రాలలోని ప్రధాన సెంటర్ల వద్ద సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శివాజీ గొప్పతనాన్ని, పరిపాలన దక్షతను. దేశాభిమానాన్ని వివరించారు. 

భువనగిరిలో..

హిందూ వాహిని జిల్లా, పట్టణ శాఖల ఆధ్వర్యంలో శోభాయాత్ర అనుమానవాడ నుండి పట్టణ ప్రజలలో కొనసాగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు జరిగింది. యువకులు కాషాయం జండాలతో ముందుకు సాగుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హిందూ వాహిని ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ నల్గొండ విభాగ ప్రచారక్ సత్యం, పాల్గొనగా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడారి శివ, ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ చందు, రామగుని భాను. యువ వాహిని జిల్లా ప్రముఖ రావుల మహేష్ , పట్టణ అధ్యక్షులు రామ్, రాజ్ భరత్, హేమంత్, సాయి, గణేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు

దేవరకొండలో..

దేవరకొండ, ఫిబ్రవరి 19 ( విజయక్రాంతి) : ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో  బుధవారం శివాజీ యువదళ్ ఆధ్వర్యంలో శివాజీ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్‌ఐ రామ్మూర్తి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏటి కృష్ణ,శివాజీ యువదళ్ సభ్యులు శేఖర్ యాదవ్, భూతరాజు భరత్ కుమార్, అంజియాదవ్, గోపి అంజన్, మల్లేష్ యాదవ్  తదితరులు పాల్గొన్నారు.