18-02-2025 07:12:53 PM
కామారెడ్డి (విజయక్రాంతి): దోమకొండలో రేపు ఛత్రపతి శివాజీ జయంతి నిర్వహిస్తున్నట్లు ఛత్రపతి శివాజీ సేవాదళ్ ప్రతినిధులు తెలిపారు. 16 సంవత్సరాల వయస్సులో కత్తి పట్టి యుద్ధం చేసిన మహా వీరుడు, యుద్ధంలో ఎత్తుకుపై ఎత్తు వేయగల ధీరుడు, మహిళల క్షేమం కోరే మహానుభావుడు, సతీ సహగమనాన్ని కూకటి వేళ్ళతో పెకిలించి ఆడవాళ్లతో అన్నయ్య అనిపించుకున్న ఆదర్శప్రాయుడు, అతనే శివాజీ రాజే బోంస్లె, సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి హిందూమతం పేరుమీద కోటలు నిర్మించి భ్రమరాంభా అమ్మ వారి కటాక్షంతో హైందవ సామ్రాజ్యన్ని స్థాపించిన పరాక్రమశాలి చత్రపతి శివాజీ, శివాజీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. మండల యువకులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.