19-02-2025 02:37:48 PM
ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరాం
జిల్లా కేంద్రంలో ఘనంగా జయంతి వేడుకలు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయకాంతి): చరిత్రకే వన్నె తెచ్చిన మహనీయుల జాబితాలో ముందు వరుసలో ఉండే ఛత్రపతి శివాజీ మహరాజ్(Chhatrapati Shivaji Maharaj) అందరికీ ఆదర్శనీయుడని ఆరే సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరామ్(Aarey Welfare Association District President Bottupalli Jayaram) అన్నారు. బుధవారం శివాజీ మహరాజ్ జయంతి(Chhatrapati Shivaji Jayanthi)ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆరే సంక్షేమ సంఘం భవనం వద్ద శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బొట్టుపల్లి జయరామ్ మాట్లాడుతూ... శివాజీ మహరాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వినతులు ఇస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం సూచనీయమన్నారు. జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలే బిక్కజి, డివిజన్ అద్యక్షడు బోర్కుటే తిరుపతి, మండల అధ్యక్షుడు గేడేకార్ సంతోష, ప్రధాన కార్యదర్శి నాగపూరి మారుతి, సహాయ కార్యదర్శి కురాట్కార్ రమేష్ తదితరులు ఉన్నారు.