calender_icon.png 21 February, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ ఒక గొప్ప పోరాట యోధుడు..

19-02-2025 12:41:41 PM

హుజురాబాద్,విజయక్రాంతి: శివాజీ జయంతి(Chhatrapati Shivaji Maharaj Jayanti 2025)ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని 27వ వార్డులో బుధవారం ఆరే కులస్తులు జెండా ఆవిష్కరించి,  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివాజీ 1930 ఫిబ్రవరి 19న సహజి, జీజబాయి లకు జన్మించాడని అన్నారు. తన 17 ఏటనే బీజాపూర్ సామ్రాజ్యంలోని తోర్నాకోటను యుద్ధంలో సొంతం చేసుకున్నాడని, అలా ఎంతోమంది రాజులకు ఎదురుగా నిలబడి పోరాటం చేసి గెలుపొందిన మహానీయుడని కొనియాడారు.

శివాజీ స్త్రీలపై అత్యంత గౌరవంగా ఉండేవారని,తాను గెలుపొందిన రాజ్యాలలోని మహిళలను కూడా తన తల్లులుగా భావించే వారిని అన్నారు. రాజ్య పరిపాలనలో పలువురికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. హిందూ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తులలో శివాజీ ఒకరని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శివాజీ యూత్ సభ్యులుఆరె కుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుమోకిలి శ్రీనివాస ఉపాధ్యక్షుడు అంగరిక శంకర్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి మొ కిలి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఉపాస సురేందర్, కోశాధికారి ఉపాస  కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.