19-02-2025 03:02:52 PM
పటాన్ చెరు,(విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలాలలోని ఆయా గ్రామాలలో ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. జిన్నారం మండల హిందూ జాగరణ సమితి, శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ గూడ చౌరస్తాలో ఉన్న శివాజీ విగ్రహానికి కొబ్బరికాయ కొట్టి పూలమాల వేశారు.
అనంతరం హిందూ జాగరణ సమితి అధ్యక్షుడు ఆనంద్(Hindu Jagran Samiti President Anand) మాట్లాడుతూ.... శివాజీ దేశాన్ని హిందూ సామ్రాజ్య ఏర్పాటుకు కృషి చేశారన్నారు. మొఘల్ రాజులపై సింహంలా గర్జించిన వ్యక్తి శివాజీ అన్నారు. రాబోవు రోజుల్లో అఖండ హిందూ రాష్ట్ర ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వం శివాజీ జయంతిని గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. శివాజీ యువజన సంఘం అధ్యక్షుడు , బీజేపీ నాయకుడు ప్రతాప్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో హిందూ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, బ్రహ్మేందర్, శ్రీనివాస్, మంద రమేష్, పుట్టి భాస్కర్, చాకలి శ్రీనివాస్, విష్ణుమూర్తి చారి, సత్యనారాయణ యాదవ్, రాజు చారి తదితరులు పాల్గొన్నారు.