19-02-2025 02:56:59 PM
ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): ఛత్రపతి శివాజీ మహారాజ్(Chhatrapati Shivaji Maharaj) స్ఫూర్తితో ధర్మ పరిరక్షణకు పాటుపడదామని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu), ఎమ్మెల్సీ దండే విట్టల్ అన్నారు. బుధవారం కాగజ్ నగర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద హిందూ జాగరన్ మంచ్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, హిందు వాహిని, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో మహారాజ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేరువేరుగా హాజరైన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీలు మాట్లాడుతూ... హైందవ ధర్మ(Hyndava Dharmam) పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. భారత భూభాగాన్ని కాపాడిన మహనీయుడిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, కొంగ సత్యనారాయణ ,శంకర్ , హర్షద్ హుస్సేన్,తదితరులు పాల్గొన్నారు.