19-02-2025 02:30:53 PM
మణుగూరు,(విజయకాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలో చక్రవర్తి చత్రపతి శివాజీ 395వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో భాగంగా యువత కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. పాల్గొన్న యువకులందరికి కేక్ తో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ... చత్రపతి శివాజీ మొగలు సామ్రాజ్య వాదులను ఎదిరించి పోరాడిన చరిత్రను గుర్తు చేసుకున్నారు. వేడుకల్లో చత్రపతి అభిమానులు వల్లభనేని రమణ, మానుకొండ రఘురాం, మాదాడి రాజేష్, న్యాయవాది రుద్ర వెంకట్, వలసల వెంకట రామారావు, పూజారి చంద్రశేఖర్, ఏనికి బాలకృష్ణ, దాట్ల వంశీ, ఆటో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షులు ఆనంద్ మోరియా, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.