11-03-2025 03:13:53 PM
ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ఛావా(Chhaava) బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లను సాధిస్తోంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఈ చారిత్రక డ్రామా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ పాత్రలో నటించారు. చావా ఇప్పుడు బాహుబలి- 2 నెలకొల్పిన రికార్డును అధిగమించింది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించి, ప్రభాస్ నటించిన బాహుబలి 2( Prabhas Baahubali Record) చిత్రం బాలీవుడ్‌లో రూ. 510 కోట్లు వసూలు చేసింది.
ఛావా ఇప్పుడు బహుబలి రికార్డును బ్రేక్ చేసింది. కేవలం 25 రోజుల్లో రూ. 516 కోట్లు వసూలు చేసింది. మొత్తంమీద, ఛావా ప్రస్తుతం అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రాలలో ఆరవ స్థానంలో ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విక్కీ కౌశల్ బ్లాక్ బస్టర్ హిట్ 'ఛావా' హిందీ వెర్షన్ విడుదలైనప్పటి నుండి, తెలుగు ప్రేక్షకుల నుండి డబ్బింగ్ వెర్షన్ కోసం డిమాండ్ పెరిగింది. చివరగా, 'ఛావా' తెలుగు వెర్షన్ మోస్తరు ప్రమోషన్లతో థియేటర్లలో ప్రారంభమైంది. గీతా ఆర్ట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ చారిత్రక బ్లాక్‌బస్టర్‌ను ప్రదర్శించింది. ట్రేడ్ నివేదికల ప్రకారం 'ఛావా' తెలుగు వెర్షన్ మొదటి రోజు రూ. 3 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. వివిధ కారణాల వల్ల దీనిని మంచి ప్రారంభం అని చెప్పవచ్చు.