27-02-2025 12:00:00 AM
ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథను వివరించే చారిత్రక ఇతిహాసంతో రూపొందిన ‘ఛావా’ చిత్రం హిందీలో విడుదలై మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది. మొదట హిందీలో విడుద లైన ఈ చిత్రం ప్రేక్షకుల డిమాండ్‌కు అనుగుణంగా తెలుగులో డబ్ చేయబడి మార్చి 7, 2025న తెలుగులో ఛావా తెలుగులో ఛావా థియేటర్లలో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనుంది.
దినేశ్ విజన్ మాడ్డాక్ ఫిల్మ్స్ నిర్మించిన ఛా వాలో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. రష్మిక మందన్నా యేసుబాయి భోంస్లేగా, అక్షయ్ ఖన్నా ఔరంగజేబుగా, డయానా పెంటీ జినత్-ఉన్-నిస్సా బేగంగా, అశుతోష్ రాణా హంబిర్రావ్ మోహితేగా, దివ్య దత్తా సోయారాబాయిగా నటించారు. ఫిబ్రవరి 14న హిందీలో విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. కేవలం 11 రోజుల్లో భారతదేశంలో దాదాపు రూ.420 కోట్ల్లు వసూలు చేసింది.