calender_icon.png 13 March, 2025 | 7:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల పోలీసుల స్పెషల్ డ్రైవ్

07-03-2025 12:01:38 AM

చేవెళ్ల , మార్చి6: చేవెళ్ళ పార్లమెంట్ కేంద్రంలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని అసాధారణ నెంబర్ ప్లేట్ ఉపయోగిస్తున్న (20), రాంగ్ రూట్లో ప్రయాణం (09) ట్రిపుల్ రైడింగ్ (03) తదితర నిబంధనలను ఉల్లంఘించిన మొత్తం 32 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు విధించి విడిచిపెట్టారు. అయితే, మూడు సార్లు నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాన్ని రోడ్లపైకి నడిపితే, వాటిని సీజ్ చేసి సంబంధిత అర్ టీఓ కార్యాలయానికి పంపిస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని పోలీసులు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని వాహనదారులకు  ద్వారా సూచించారు.