26-02-2025 12:00:00 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 25 : ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండలం నాంచేరి అనుబంధ గ్రామం ఇంద్రారెడ్డి నగర్లో రూ.10 లక్షలు, ఖానాపూర్ గ్రామంలో రూ.15 లక్షలు, రేగడిఘనపూర్ గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యం సాఫీగా సాగేలా త్వరితగతిన రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతున్నామని వివరించారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు వీరేందర్రెడ్డి, మాజీ సర్పంచ్లు నర్సింలు, రాంరెడ్డి, జహంగీర్, స్థానిక నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.