calender_icon.png 13 January, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీం పంచముఖి ఆధ్వర్యంలో చదరంగం పోటీలు

12-01-2025 10:08:58 PM

మందమర్రి (విజయక్రాంతి): స్వామి వివేకానంద జయంతి సందర్బంగా (నేషనల్ యూత్ డే)పురస్కరించుకొని టీం పంచముఖి ఆధ్వర్యంలో చదరంగం పోటీలు నిర్వహించారు. పట్టణంలోని పాలచెట్టు ప్రాంతంలోని శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం అవరణలో ఆదివారం టీమ్ పంచముఖి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల స్థాయి చదరంగం పోటీలను సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్, పట్టణ సీఐ కె శశిధర్ రెడ్డి, రాష్ట్ర చదరంగం అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండీ సిరాజ్ ఉర్ రహమాన్, శ్రీ వెంకటేశ్వర ఆలయం ప్రధాన అర్చకులు అనంతచారిలు స్వామి వివేకానంద చిత్ర పటానికి పూల మాలలతో అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి  పోటీలను ప్రారంభించారు. 

జిఎం దేవేందర్ మాట్లాడుతూ.. చదరంగం ఒక మంచి క్రీడా, ఈ ఆటను కనుక అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మంచి నడవడికకు ఉపయోగపడుతుందని ఆన్నారు. పట్టణ సీఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా క్రీడలు దోహదపడతాయని ఆన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించి క్రీడల్లో రాణించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, టీం పంచముఖి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కృష్ణ చైతన్య ఆచార్య, కమిటీ సభ్యులు డి శంకర్ రావ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చేస్ అసోసియేషన్ చైర్మన్ ఈగ కనకయ్య, ఆర్బిటర్ ఎ కల్పన, ఆర్గనైజర్స్ ఎం రవీందర్, శివ కృష్ణ, సమ్మయ్య, వామన్, శృతి పాల్గొన్నారు.