calender_icon.png 18 November, 2024 | 7:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చెయ్యాలి

18-11-2024 05:19:03 PM

చేర్యాల (విజయక్రాంతి): చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని సిపిఎం జిల్లా అధ్యక్షులు ఆముదాల మల్లారెడ్డి అన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలను కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీచేపట్టి, నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ డివిజన్ కావలసిన అన్ని అర్హతలు ఉన్నప్పటికీ జాప్యం ఎందుకు ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం ఎన్నికలకు ముందు జనగామ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి రాగానే చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీనిచ్చారని ఆయన గుర్తు చేశారు.

కాలయాపన కోసమే జేఏసీ ఏర్పడిందని ఆయన ఎద్దేవ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఉంటే కాంగ్రెస్ నాయకులను ప్రజలే అడ్డుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. డివిజన్ సాధన కోసం ప్రజల పక్షాన నిలబడి సిపిఎం పార్టీ అలుపు ఎరగని పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శెట్టి పల్లి సత్తిరెడ్డి, అరుణ్ కుమార్, కొంగర వెంకట్ మావో, దాసరి ప్రశాంత్, రాళ్ల బండ నాగరాజు, శారద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.