calender_icon.png 29 March, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుగట్టు హుండీ ఆదాయం రూ.32 లక్షలు

26-03-2025 01:55:51 AM

నల్లగొండ, మార్చి 25 (విజయక్రాంతి) :  నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయానికి భక్తుల నుంచి రూ.32.28లక్షల ఆదాయం వచ్చింది. 41 రోజులుగా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు.

గట్టుకింద పార్వతమ్మ అమ్మవారి హుండీ ఆదాయం రూ.4,02,640 రాగా, గట్టుపైన స్వామివారి హూండీ ఆదాయం రూ. 28,26,120 మొత్తం రూ.32,28,760 ఆదాయం సమకూరింది. అన్నదానం కోసం భక్తులు రూ. 1,15,330 అందించారు.

లెక్కింపులో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. నవీన్, దేవాదాయశాఖ పరిశీలకులు ఏడుకొండలు, నందిగామ శ్రీదుర్గ శివసాయి సేవా సమితి సభ్యులు, హెచ్డీఎఫ్సీ నల్లగొండ బ్రాంచీ సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.