నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నల్లగొండ, జనవరి 24 (విజయక్రాంతి): చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను భక్తుల భారీగా తరలివచ్చి విజయంతం చేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిలుపునిచ్చారు. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులో శుక్రవారం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక, వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించి, ప్రచార వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని గుర్తు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.