చేర్యాల, జనవరి 10: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శిగా సుమలత రమణారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నాడు గాంధీభవన్లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు.
కొమురవెల్లి మండలం అయినా పూర్ గ్రామానికి చెందిన చెరుకు సుమలత మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను రాష్ట్ర కార్యవర్గంలో తీసుకున్నందుకు డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీని గెలిపించడానికి పాట పాడుతానని తెలిపారు.