09-03-2025 06:08:10 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం జేత్రం తండ గ్రామ పరిధిలోని రేడ్య తండ & హనుమంతు తండ నూతన దేవాలయంలో శ్రీశ్రీశ్రీ మెరామ & శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమాలు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు వడ్ల నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు మాసాయిపేట్ శ్రీనివాస్, ఓబీసీ సెల్ ఆంజనేయులు, ఎస్సీ సెల్ స్టాలిన్ నర్సింలు, ఎస్టీ సెల్ ఫకీర్ నాయక్, ట్రెజరర్ బాల్ రెడ్డి, కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్, యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్, సాయికుమార్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్, సోలిపేట ప్రసాద్ రెడ్డి, భాబ్య నాయక్, రతన్ నాయక్, వాసు నాయక్, రాజేందర్ నాయక్, తండ ప్రజలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.