calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ మండలంలో ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

19-04-2025 07:51:48 PM

నర్సింగ్/చేగుంట (విజయక్రాంతి): దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల ఉపాధ్యక్షులు వినోద్, మండల కోఆర్డినేటర్ జుకంటి రాజగౌడ్ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తూప్రాన్ టోల్ ప్లాజా నుండి నర్సింగ్ చారి హాస్పిటల్ వరకు వందల సంఖ్యలో కార్లలో వచ్చి అనంతరం అక్కడనుండి ర్యాలీగా చౌరస్తా వరకు వెళ్లారు. కార్యకర్తలు, నాయకులు, జై కాంగ్రెస్, జై చెరుకు శ్రీనివాస్ రెడ్డి, జై శ్రీనన్న, నినాదాలు చేస్తూ వెళ్లారు. చౌరస్తా వద్ద చెరుకు శ్రీనివాస్ రెడ్డికి క్రేన్ సాయంతో భారీ గజమాలతో సన్మానం చేశారు, చౌరస్తా వద్ద భారీ కేక్ కట్ చేసి అభిమానులు, నాయకులు కార్యకర్తలు ఒకరికి ఒకరు కేకు తినిపించడం జరిగింది.

జన్మదిన వేడుకల్లో మాజీ టెలికామ్ బోర్డు మెంబెర్ అంచురి రాజేష్, పట్టణ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్, మండల బిసి సెల్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షులు యాదగిరి యాదవ్, సంపత్ రెడ్డి, బాచి, బాలరాజ్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, జిల్లా నాయకులు, నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మండల నాయకులు, వివిధ గ్రామాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కార్యకర్తలు నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.