calender_icon.png 2 May, 2025 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు

19-04-2025 11:31:42 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను దౌల్తాబాద్, రాయపోల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజమాల, శాలువాలతో కార్యకర్తలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్, రాయపోల్ మండలాల అధ్యక్షులు పడాల రాములు, తప్పెట సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శశికాంత్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బండారు లాలు, మండల ఉపాధ్యక్షుడు మద్దెల స్వామి, నాయకులు మల్లారెడ్డి, ఆది వేణుగోపాల్, మల్లేశం, విజయ భాస్కర్ రెడ్డి, సంపత్ రెడ్డి, అంజి, ఏసు, నందం, రామ గౌడ్, కృష్ణారెడ్డి, రాజిరెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.