బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్దిదారులకు రావాల్సిన డబ్బులను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం రాజారాం దుబ్బకు చెందిన 16 మంది డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు 14.51 లక్షల, వీరాపూర్ గ్రామానికి చెందిన 18 మంది డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారులకు 8 లక్షల 69 వేల 570 రూపాయిలు అందజేశారు. మొత్తం 34 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారులకు 23 లక్షల 20 వేల 570 రూపాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు.