26-03-2025 03:22:18 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో శాంతినగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు తొండవరపు అర్జున్ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలంగాణ భవన్ లోని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంకు తెలియజేశారు. బీఆర్ఎస్ సభ్యుడిగా ఉండి మృతి చెందిన తొండవరపు అర్జున్ కుటుంబానికి కేంద్ర పార్టీ ఆఫీసు నుండి రెండు లక్షల రూపాయలు చెక్కును పంపించారు. ఆ చెక్కును మృతుని తండ్రి తొండవరపు జానుకి బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ అందజేసి, మీకు పార్టీ అంతగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ... పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు వారి కుటుంబానికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా పార్టీ కష్ట కాలంలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం తొండవరపు జాను ఈ చెక్కు రావడానికి కృషి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చెక్కు అందజేసిన వారిలో టిఆర్ఎస్ మండల పార్టీ కన్వీనర్ ఆకోజు సునిల్ కుమార్, మండల నాయకులు రామకృష్ణ, బీసీ సెల్ గౌరవ అధ్యక్షులు గోసుల వెంకట శ్రీనివాస్, రేగుల నరసింహారావు తదితరులు ఉన్నారు.