కామారెడ్డి, నవంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం చెక్కులను శుక్రవారం రాష్ట్ర వ్యవసాయశాఖ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పంపిణీ చేశారు.
బాన్సువాడ మండలం రాజారాం దుబ్బకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.14.51 లక్షలు, వీరాపూర్ గ్రామానికి చెందిన 18 మంది లబ్ధిదారులకు రూ.8.69 లక్షల చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.