సిద్దిపేట (విజయక్రాంతి): భారతీయ కిసాన్ సంఘ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శిగా తొగుట మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన చేపూరి చంద్రాగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీలు వేరైనా రైతులంతా ఒక్కటేనని చెప్పారు. ఈ సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధం కాదన్నారు. మన జిల్లాలోని అన్ని మండలాలలో, గ్రామలలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోల్లలో, వ్యవసాయ కరెంటు, అకాల వర్షాల కారణంగా అక్కడక్కడ కరెంటు షాక్ వల్ల రైతులు చనిపోతున్నారని, ఒకే నెలలో నలుగురు రైతులు షాక్ సర్క్యూట్ వల్ల చనిపోయారని ఇలాంటి అనేక సమస్యలపై కార్యచరణ రూపొందించి పోరాటం చేస్తామన్నారు.