మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అభివృద్ధిలో పట్టణాన్ని పరుగులు పెట్టించాలని చెన్నూరు ఎమ్మెల్యే జి వివేక్ వెంకటస్వామి అన్నారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు నెల రోజుల లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతే కాకుండా పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగు పరచాలని సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాం సుందర్ కు సూచించారు. నూతనంగా నియామకమైన 16 మంది వార్డ్ ఆఫీసర్లను, జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్ లు విధి నిర్వహణ లో పారదర్శకంగా వ్యవహరిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సి పల్ కమిషనర్ నులిగొండ వెంకటే శ్వర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం సుమతి, మున్సి పల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్ సందీప్, రెవేన్యూ ఆఫీసర్ పి కృష్ణ ప్రసాద్, అదికారులు సిబ్బంది పాల్గొన్నారు.