calender_icon.png 9 April, 2025 | 8:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే చెన్నూరు అభివృద్ధి

31-03-2025 12:00:00 AM

 రూ. 40 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు 

-ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి 

చెన్నూర్, మార్చి 30 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చెన్నూర్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో ఆయన కార్యకర్తలతో మాట్లాడారు.

చెన్నూర్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేయడం కోసం రూ. 40 కోట్లతో గోదావరి నుంచి తాగునీటి సరఫరా ప్రణాళిక సిద్ధం చేసి, అమృత్ 2.0 పథకం పనులు ప్రారంభించామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతోందన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చెన్నూరు నియోజక వర్గానికి 2 టీఎంసీల నీరు కేటాయించాలని అసెంబ్లీలో కోరగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు.  

ప్రజా సంక్షేమం తమ ప్రాధాన్యత అని, నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఫారెస్ట్ అనుమతుల సమస్యల కారణంగా కొన్ని బ్రిడ్జి పనులు నిలిచిపోయినప్పటికీ, త్వరలోనే వాటికి అనుమతులు తెప్పించి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. చెన్నూర్ బైపాస్ రోడ్డు పనులను వేగంగా ప్రారంభించి ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.