23-03-2025 11:22:00 PM
ఐపీఎల్ 2025 చెపాక్ వేదికగా జరిగినా మూడవ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్(Mumbai Indians)పై చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) నాలుగు వికెట్ల తేడాతో గెలుపోందింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా చెన్నై 19.1 ఓవర్లలో మ్యాచ్ ను ముగించింది. చెన్నై బ్యాటర్లలో రచిన్ రవీంద్ర (65), రుతురాజ్ గైక్వాడ్ (53) అర్థ సెంచరీలతో రాణించారు. ముంబయి బౌలర్లలో విగ్నేష్ పుథూర్ 3 వికెట్లతో టాప్ లో నిలవగా... చాహర్, విల్ జాక్స్ చెరొక వికెట్ పడగొట్టారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబయి... నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ(Tilak Verma) (31) టాప్ స్కోరర్ గా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ (29), రోహిత్ శర్మ డకౌటవ్వగా.. నమన్ ధీర్ (17), రియాన్ రికెల్టన్ (13), విల్ జాక్స్ (11), రాబిన్ మింజ్ (3), మిచెల్ శాంట్నర్ (11) పరుగులు చేశారు. చివర్లో దీపక్ చాహర్ (28) పరుగులతో రాణించగా ముంబయి స్కోరు 150 దాటింది. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4, ఖలీల్ అహ్మద్ 3, రవిచంద్రన్ అశ్విన్, నాథన్ఎల్లిస్ తలో వికెట్ తీసారు.