calender_icon.png 5 November, 2024 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నై-బెంగుళూరు@ 30 మినిట్స్

05-08-2024 01:58:55 AM

  1. మద్రాస్ ఐఐటీలో 425 మీటర్ల హైపర్ లూప్ నిర్మాణం
  2. త్వరలో రైల్వే బోగీలతో ట్రయల్ రన్

మద్రాస్ (చెన్నై), ఆగస్టు 4: భారత దేశ రవాణా రంగంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతం కానుంది. మద్రాస్ ఐఐటీ.. తైయూర్ క్యాంపస్‌కు చెందిన 76మంది విద్యార్థులు.. 425 మీటర్ల పొడవైన హైపర్‌లూప్ ట్యూబ్‌ను నిర్మించారు. ‘ఆవిష్కార్ హైపర్‌లూప్’ పేరుతో బృందంగా ఏర్పడి బుల్లెట్ ట్రైన్ కంటే ఫాస్ట్‌గా వెళ్లగలిగే ఓ ఇండోర్ రైల్వే వ్యవస్థను తయాచేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే దీనికి సంబంధించి హైపర్‌లూప్ ట్యూబ్‌ను నిర్మించగా.. త్వరలో నాలుగు దశల్లో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది క్యాంపస్‌లో జరిగే హైపర్‌లూప్ ఇంటర్నేషనల్ పోటీల్లో ఈ ప్రయోగాత్మక రన్‌ను ప్రదర్శించే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫసర్ కామకోటి తెలిపారు. 

అసలేంటి ఈ హైపర్‌లూప్?

ఇది ఒక ఇండోర్ రైల్వే వ్యవస్థ. పెద్ద సైజ్ పైప్‌లా కనిపించే ఓ ట్యూబ్ లాంటి నిర్మాణాన్ని. ఎలాంటి గాలి ఒత్తిడి లేకుండా తయారుచేస్తారు. అందులో ఎలక్ట్రానిక్ బోగీనీ ఉంచుతారు. తక్కువ గాలి పీడనం, అయస్కాంత బలం తోడవడంతో హైపర్‌లూప్ బోగీ గంటకు 500-600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 

అయితే ఈ ప్రయోగం విజయవంతం అయితే ముందుగా హైపర్‌లూప్ బోగీలో సరుకులు రవాణా చేసి చూస్తామని.. తదనంతరం మనుషులను ఒకచోట నుంచి వేరోచోటకు చేరవేసే ఏర్పాట్లు చేస్తామని ప్రొఫెసర్లు చెబుతున్నారు.ఇది ఆచరణలోకి వస్తే చెన్నై నుంచి బెంగుళూరుకు కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కాగా ఈ పరిశోధనకు భారతీయ రైల్వే, ఎల్ అండ్ టీ సంస్థలు నిధులు అందిస్తున్నాయి.