calender_icon.png 8 January, 2025 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్మన్ డా. జివివి సుదర్శన్ రావుని అభినందించిన కెమిస్ట్ & డ్రగ్గిస్ట్ సభ్యులు

07-01-2025 04:39:27 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం పట్టణంలో బ్రిడ్జి పక్కనే గల ప్రముఖ దేవాలయమైన శ్రీ అభయాంజనేయ స్వామి గుడి ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పట్టణ ప్రముఖులు డాక్టర్ జివివి సుదర్శన్ రావుని కెమిస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చములు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. వైద్యవృత్తితో పాటు లయన్స్ క్లబ్, జీయర్ మఠం, రెడ్ క్రాస్, ఐఎంఏ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సుదర్శన్ రావు సుదీర్ఘకాలంగా అనేక రకాల సేవ కార్యక్రమాలలో ముందుంటున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన నాయకత్వంలో దేవాలయం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పరిమి సోమశేఖర్, కార్యదర్శి చల్లగుళ్ల నాగేశ్వరరావు, కోశాధికారి మురళీమోహన్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొని డాక్టర్ సుదర్శన్ రావు, జయభారతీ దంపతులకి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.