calender_icon.png 20 April, 2025 | 11:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నూతన కార్యవర్గం ఎన్నిక

19-04-2025 08:58:04 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం స్థానిక ఐబి ఆవరణలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శేఖర్, అసోసియేషన్ కార్యదర్శి తొగరి సుధాకర్ హాజరయ్యారు. అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొత్త కిరణ్, కార్యదర్శిగా ఆది సతీష్, కోశాధికారిగా జావిద్ హుస్సేన్, గౌరవ అధ్యక్షులు గా షాహిద్ అలీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మెడికల్ షాప్ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ ఎన్నికలకు జిల్లా అధ్యక్షుడు మోటారి చంద్రశేఖర్ సెక్రటరీ తొగరు సుధాకర్ లు ఎన్నికల అధికారులుగా వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ యజమాన్యులు లక్ష్మణ్, రాజేష్, కేదారి, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు.