calender_icon.png 11 January, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీలో కెమికల్ వ్యర్థాల డంపింగ్ కేంద్రం సీజ్

03-12-2024 02:48:35 AM

రాజేంద్రనగర్, డిసెంబర్ 2: బిల్డింగ్ మెటీరియల్ విక్రయ కేంద్రం మాటున ట్యాంకర్ల ద్వారా కెమికల్ వ్యర్థాలను మూసీ నదిలో డంపింగ్ చేస్తున్న కేంద్రాన్ని సీజ్ చేసినట్లు రాజేంద్రనగర్ తహసీల్దార్ బొమ్మ రాములు సోమవారం తెలిపారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్‌లో లంగర్‌హౌస్‌కు వెళ్లేదారిలో బ్రిడ్జి పక్కన ఉన్న ఓ స్థలంలో కొన్ని సంవత్సరాలుగా బిల్డింగ్ మెటీరియల్ విక్రయిస్తున్నారు.

దీనిని మాటుగా చేసుకొని నిర్వాహకులు ప్రతీరోజు రాత్రి సమయంలో వివిధ ప్రాంతాల్లోని కంపెనీల నుంచి వ్యర్థాలను ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ తంతును ఇటీవల లంగర్‌హౌస్ సం గం ఆలయంలోని అయ్యప్ప భక్తులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారం ఏళ్లుగా గుట్టుగా సాగుతోందని సమాచారం. చివరకు అధికారులు సంబంధిత మెటీరియల్ విక్రయ కేంద్రాన్ని సీజ్ చేశారు.