calender_icon.png 27 December, 2024 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసైన్డ్ భూమిలో కెమికల్ ప్లాంట్లు

26-12-2024 02:38:59 AM

*  రాళ్లకత్వా  గ్రామస్తుల ఆందోళన

పటాన్‌చెరు, డిసెంబర్ 25: జిన్నారం మండలం రాళ్లకత్వా గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 286 ప్రభుత్వ అసైన్డ్ భూమిలో గుట్టుచప్పుడు కాకుండా రెండు బ్యాటరీ రీసైక్లింగ్ కెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.ఈ కెమికల్ ప్లాంట్లలో బ్యాటరీ లెడ్‌లను కరిగిస్తున్నారు. దీంతో కెమికల్ ద్రవాలు సమీపంలో శివనగర్, రాళ్లకత్వ గ్రామ చెరువుల్లో కలుస్తున్నాయి.

బ్యాటరీ లెడ్‌లను కరిగించేందుకు పెద్ద సెటప్‌నే ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద గొట్టాలతో బాయిలర్, ఇతర పరికరాలను ఏర్పాటు చేయడాన్ని గుర్తించిన రాళ్లకత్వ గ్రామస్తులు బుధవారం బ్యాటరీ రీసైక్లింగ్ కెమికల్ ప్లాంట్ల వద్ద ఆందోళన చేశారు. తహసీల్దార్ భిక్షపతిని కలిసి ఫిర్యాదు చేశారు.