29-04-2025 08:20:37 PM
చేగుంట (విజయక్రాంతి): మెదక్ జిల్లా చేగుంటలో సైబర్ నేరాలపై జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేగుంట ఎస్ఐ శ్రీ చైతన్య రెడ్డి(SI Sri Chaitanya Reddy) ఆధ్వర్యంలో ఏఎస్ఐ రాంబాబు, ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ... మండలంలో ఉన్న ప్రజలు, ఎవరు ఏమి ఫోన్ చేసినా, ఓటిపి చెప్పకూడదని, బ్యాంకు నుంచి ఫోన్ చేసినాము... మీకు జాబ్ వస్తది, మీరు ముందుగా, మాకు కొన్ని డబ్బులు కట్టమని చెపుతారు, ఇలాంటి మోసపూరిత ఫోన్ కాల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు చెప్పారు. ఎవరైనా సైబర్ నేరాలకు మోసపోతే అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కు కానీ, 1930 కు కానీ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీ చైతన్య రెడ్డి, బిక్య నాయక్ ఎస్ఐ-2, ఏఎస్ఐ రాంబాబు, రవీందర్, కానిస్టేబుల్, వెంకటేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.