calender_icon.png 31 October, 2024 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలంలో చిరుత పులి కలకలం

14-08-2024 02:47:26 AM

  1. ఆలయ ఏఈవో ఇంటి పరిసరాల్లోనే సంచారం 
  2. భయాందోళనలో భక్తులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): శ్రీశైలంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. నెల రోజుల క్రితం పాతాళగంగ పరిసరాల్లో అర్ధరాత్రి సంచరించినట్లు భక్తులు గుర్తించి అటవీ అధికారుల కు సమాచారమిచ్చారు. ఈ విషయం మరువక ముందే మంగళవారం ఆలయ ఏఈవో మోహన్ పెంపుడు కుక్క కోసం ఇంటి కాంపౌండ్‌లోకి చొరబడినట్లు స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆలయ ఈవో పెద్దిరాజు స్థానికులను, భక్తులను, అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఎవరూ ఒంటరిగా నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లొద్దని ఆలయ అధికారులు, అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. చిరుతను బంధించేందుకు అధికారు లు విశ్వప్రయత్నం చేస్తున్నారు.