calender_icon.png 5 February, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ సమరానికి సై!

05-02-2025 01:51:20 AM

  • గెలుపు అవకాశాలపై ఎవరికి వారే ధీమా 
  • అభివృద్ధి పథకాలను నమ్ముకున్న కాంగ్రెస్ 
  • ప్రభుత్వంపై వ్యతిరేకతే మా సత్తా: బీఆర్‌ఎస్

ఖమ్మం, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పంచాయతీ సమరానికి రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నెల 15వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అయితే గెలుపు అవకాశాలపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.

పంచాయతీ ఎన్నికలు తమకే లాభిస్తాయని బీఆర్‌ఎస్ ఆశతో ఉండగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం తమకే ఎక్కువ శాతం ఫలితాలు వస్తాయని, గత ఎన్నికల ఫలితాలను రిపీట్ చేసి తీరుతామనే ధీమాలో ఉన్నారు. ఖమ్మం జిల్లా వ్యా  577 గ్రామ పంచాయతీలు ఉన్నా  ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, మధిర, సత్తుపల్లి మున్సిపాల్టీలు ఉన్నాయి.

తాజాగా ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది. రానున్న పంచాయతీ ఎన్నికల్లో తాము అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమను  గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అయితే ఒకింత భయం కూడా కాంగ్రెస్‌ను వెంటాడుతున్నది.

కొన్ని సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో పాటు తాజాగా రైతుభరోసా పథ  సంపూర్ణంగా అమలు చేయకపోవడ  కారణంగా తెలుస్తున్నది.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇం  ఆత్మీయ భరోసా, రైతు భరోసా, నూతన రేషన్‌కార్డుల జారీ, మహిళలకు ఉచి  బస్సు స్కీమ్, గ్యాస్ సబ్బిడీ వంటి పథకాలు అమలు చేస్తున్నందున ప్రజలు తప్ప  కాంగ్రెస్‌నే ఆదరిస్తారనే ఆశతో కాం  పార్టీ శ్రేణులు ఉన్నాయి.

బీఆర్‌ఎస్ డీ  పడటంతో పాటు నాయకత్వ లోపం కూడా ఆ పార్టీని వేధిస్తుండడంతో కాంగ్రెస్‌కే ఎక్కువ శాతం గెలుపు అవకాశాలున్నాయని అంటున్నారు. 

బీఆర్‌ఎస్‌లో నాయకత్వ సమస్య?

గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వా  ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. పలువురు సీనియర్ నాయకులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, జడ్పీ  బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్ పార్టీకి నాయకత్వ స  తలెత్తింది.

ఈ కారణాల రీత్యా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మరిన్ని సీట్లు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిని బీఆర్‌ఎస్ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలు గ్రహించారని, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపా  తథ్యమని ధీమాగా ఉన్నారు.

రైతుల్లో తీ  వ్యతిరేకత వచ్చిందని, ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వచ్చిందని, రైతు భరోసా అందక, పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళనలో ఉన్నారని ఇవన్నీ బీఆర్‌ఎస్‌కే లాభిస్తాయని ఆ పార్టీ నేతలు ధీమాగా మాట్లాడుతున్నారు.

గ్రామాలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలనకే ప్రజామోదం లభిస్తుందని, తిరిగి కేసీఆర్ పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు.

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యనే పోటీ? 

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటీ తీవ్రంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. మిగతా పార్టీలు నామమాత్రపు పోటీయే ఇచ్చే అవకాశముంది. సీపీఎం, సీపీఐలు ఉమ్మడి రాగం ఎత్తినప్పటికీ ఎన్నికలు వచ్చే సరికి ఎవరికి వారే యుమునా తీరే అన్న చందంగా వ్యవహరించడం షరామామూలే.

దీంతో కమ్యూనిస్టులకు బలమున్న స్థానాల్లోనే ఆ పార్టీలు సత్తా చూపే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీపడే అవకాశం ఉంది. జిల్లాలో బీజేపీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం మినహా ఖమ్మం జిల్లాలో దాని ప్రభావం నామమాత్రంగానే ఉంటుంది.

రిజర్వేషన్ల ఖారారుకు కసరత్తు 

తాజాగా బీసీ సర్వే నివేదికను కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టడడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ప్రాథమికంగా చర్చించడంతో రిజర్వేషన్ల ఖారారుకు కూడా కసరత్తు జరుగుతోంది. ఈ నెల 10  12 తేదీల మధ్య నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తున్నది. 

ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మంత్రులు 

పంచాయతీ ఎన్నికలను జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రతిష్టాత్మకంగా  తీసుకుంటున్నారు. అందులో భాగంగానే వారం రోజులుగా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకుంటూ, భరోసా కల్పిస్తున్నారు.

అంతా ఐక్యంగా ఉండి, కాంగ్రెస్ సత్తా చాటాలని చెపుతున్నారు. కల్లూరు, వైరా, పాలేరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు మంత్రి పొంగులేటి తీవ్రంగా యత్నిస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని పొంగులేటి పావులు కదుపుతున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. రఘునాధపాలెం మండలం, అర్బన్ మండలం, సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తున్నారు.