calender_icon.png 29 March, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు ఆమోదంపై హర్షం

23-03-2025 12:11:32 AM

కృతజ్ఞతలు తెలిపిన ఓబీసీ లాయర్స్ జేఏసీ

హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నిలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశ పెట్టిన బిల్లుకు ఆమోదం లభించడంతో ఓబీసీ లాయర్స్ జేఏసీ హర్షం వ్యక్తం చేసిం ది. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అన్ని రాజకీయ పక్షాలకు కృతజ్ఞతలు తెలిపింది.

శనివారం నిర్వహించిన సమావేశంలో ఓబీ సీ లాయర్స్ జేఏసీ చైర్మన్ తలకొక్కుల రాజు, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్‌గౌడ్ మాట్లాడారు. ఈ చట్టం తో న్యాయపరంగా అన్ని లోయర్ కోర్టు నుంచి హైకోర్టు వరకు ఏజీపీ జీపీ అన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాష్ట్ర ప్రభుత్వం నియమించే నియామకాల్లో 42 శాత రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభు త్వం కూడా ఈ చట్టాన్ని త్రికరణశుద్ధితో పార్లమెంట్‌లో అమలు చేయాలని కోరారు. రాష్ట్రపతి ఆమోదం పొందే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని తెలిపారు. దీనిపై ఈ నెల 31న అన్ని సంఘాలతో ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో కన్వీనర్ కోల జనార్ధ న్, ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ పొన్నం దేవరాజు గౌడ్, ఐఎల్‌పి ఏస్టేట్ ప్రెసిడెంట్ పూస మల్లేశం, టీ రాహుల్ వంశీకృష్ణ లాయర్స్ జాక్ కన్వీనర్స్, కొండూరి వినోద్ కుమార్ అసోసియేషన్ సెక్రటరీ పాల్గొన్నారు.