calender_icon.png 19 March, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ బిల్లు ఆమోదంపై హర్షం

19-03-2025 01:30:58 AM

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేయడంపై మల్కాజిగిరి బార్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌తోపాటు ఆమోదం తెలిపిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, కేంద్ర ప్రభుత్వంతో కూడా అమలు చేయించడానికి బాధ్యత వహిస్తామని చెప్పడం సంతోషకరమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర బీజేపీ ఎంపీలు మాట్లాడి బాధ్యతగా పార్లమెంటులో ఆమోదింపజేయాలని న్యాయవాదులు కోరారు.

ఈ సంబురాల్లో జనరల్ సెక్రటరీ శ్రీకాంత్, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పొన్నం దేవరాజ్ గౌడ్, తురక రత్నయ్య, కె వాసు, స్వాతి, సునీత రాజు, బుడంపల్లి సుధీర్‌బాబు, మన్మోహన్ యాదవ్, జాహ్నవి దుర్గ పాల్గొన్నారు.