calender_icon.png 20 April, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదంపై హర్షం

05-04-2025 04:42:33 PM

జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): లోక్‌సభ, రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం పట్ల భారత్ సురక్ష సమితి నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... వక్ఫ్ సవరణ బిల్లును దేశ ప్రజలందరూ స్వాగతిస్తున్నారన్నారు. దేశంలోని నిరుపేద ముస్లింలకు అత్యంత ఉపయోగకరంగా ఉండే ఈ బిల్లును తీసుకువచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. వక్స్ ఆస్తులను తమ 'బాప్ కీ జాగీర్'గా భావించే వారు నియంత్రణలోకి వస్తారన్నారు.

వక్ఫ్ ఆస్తులు పేద ముస్లింలకే ఉండాలని, కానీ కొంతమంది బడా ముస్లిం నేతలు వక్ఫ్ ఆస్తులను ఇంతకాలం అనుభవిస్తూ కోట్లాది రూపాయలు సంపాదించారని విమర్శించారు. సాధారణ ముస్లింలకు ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన రోజును "చారిత్రక దినం"గా మనం అందరం సంబరాలు జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసిఎస్ రాజు, చీట్ల గంగాధర్, సింగం గంగాధర్, వేముల పోచమళ్ళు, నరేందుల శ్రీనివాస్, గండ్ర ప్రవీణ్ రావు, ఎడమల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.