13-03-2025 01:33:33 AM
డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): రెవెన్యూ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభం కానుందని, ఇప్పటివరకు స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ పోస్టే ఉన్నతంగా ఉండేదని, దానికంటే కూడా అత్యున్నతమైన 33 స్పెషల్‌గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి జీవో విడుదల చేయడంపై అభినందనీయమని డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వీ లచ్చిరెడ్డి, కే రామకృష్ణ బుధవారం హర్షం వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీసీఎల్‌ఏ నవీన్‌మిట్టల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ రాములు, రమేశ్ పాక, బానాల రామిరెడ్డి, వీ బిక్షం తదితరులు పాల్గొన్నారు.