calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో బీసీ బిల్లు రిజర్వేషన్ల అమలు చేసినందుకు హర్షం..

18-03-2025 09:28:22 PM

కామారెడ్డి (విజయక్రాంతి): బిసి బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మంగళవారం రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మదలి షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో ఆయన బీసీ కులగనన జరిపించి వారికి రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కులగనన జరిపించి బీసీ రిజర్వేషన్లను 29% నుండి 42 శాతానికి పెంచి నిన్న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదింపజేసినందుకు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి, మహ్మద్ అలీ షబ్బీర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.

అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు ఈ రిజర్వేషన్లతో న్యాయం జరిగిందని కొని ఆడినారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పండ్లరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, షేరు కన్నయ్య ఓ బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, సంపంగి శంకర్, బిసి సెల్ జిల్లా నాయకుడు సాప శివరాములు, మల్లయ్య రాజేష్, హైమద్, శంకర్, ముత్యంపేట శ్రీనివాస్, లెక్కపదిని గంగాధర్, అస్లాం, కుడుముల సత్యం నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.